ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే దేశ సేవవైపు అడుగులేస్తున్నాడు.. ఉత్తర్ప్రదేశ్ ఆగ్రాకు చెందిన తొమ్మిదేళ్ల దేవ్ ప్రసాద్. దేశం, సైనికులంటే చిన్ననాటి నుంచే అమితమైన ప్రేమ పెంచుకున్న దేవ్ దేశ రక్షణలో ప్రాణాలర్పించిన సైనికులకు సలాం చేస్తూ వారి కుటుంబాల బాగోగులు తెలుసుకునేందుకు యాత్ర చేపట్టాడు. ఇప్పటికే 40 వేల కిలోమీటర్లు ప్రయాణించి..1500లకు పైగా అమరవీరుల కుటుంబాలను కలిశాడు.
పెద్దయ్యాక సైన్యంలో చేరి దేశాన్ని కాపాడలన్నదే దేవ్ లక్ష్యం. అందుకే ఇప్పటి నుంచే.. సైనిక దుస్తులు ధరించి, దేశ సేవవైపు అడుగులు వేస్తున్నాడు.
ముంబయిలో 2008లో నవంబర్ 26న తాజ్హోటల్లో జరిగిన బాంబు దాడి యావత్ దేశాన్ని కలవరపరచింది. ఆ ఘటనలో ప్రజల ప్రాణాలు కాపాడేందుతు తన ప్రాణాలర్పించిన అమరవీరుడు టాకా రామ్ అంబాలేను కలిసేందుకు మహారాష్ట్రకు వచ్చాడు దేవ్.