తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోంలో రెండు బస్సులు ఢీ.. 9మంది మృతి - తొమ్మిది మంది మృతి

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

అసోంలో రెండు బస్సులు ఢీ.. 9మంది మృతి

By

Published : Sep 23, 2019, 12:47 PM IST

Updated : Oct 1, 2019, 4:35 PM IST

అసోంలో రెండు బస్సులు ఢీ.. 9మంది మృతి

అసోం శివసాగర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని డిమో గ్రామం సమీపంలో ఓ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో సుమారు 9 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

జరిగిందిలా...

ఓ బస్సు జాతీయ రహదారి 37 మీదుగా గోలాఘాట్​ నుంచి డిబ్రూగడ్​కు వెళుతోంది. ఉదయం 8.35 గంటల సమయంలో డిమో గ్రామానికి సమీపంలో అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న మినీ బస్సును బలంగా ఢీకొట్టింది. రెండు బస్సులు రోడ్డు పక్కన ఉన్న గుంటలో పడ్డాయి. ఈ ప్రమాదంలో వాహనాలు రెండు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ఇదీ చూడండి : ఆయన భార్యకు మోదీ ఎందుకు సారీ చెప్పారంటే..

Last Updated : Oct 1, 2019, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details