తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'స్వతంత్రం' కోసం ఏడుగురి దారుణ హత్య- అడవిలో శవాలు - Pathalgarhi latest news

ఝార్ఖండ్​ పశ్చిమ సింగభూమ్​ జిల్లాలో భయానక హత్యలు జరిగాయి. పథ్తల్​గఢీని వ్యతిరేకించిన ఏడుగురు గ్రామస్థులను దారుణంగా చంపారు. శవాలను 4కి.మీ దూరంలో అడవిలో పడేశారు. ఈ ఘటనపై ఝార్ఖండ్ సీఎం హేమంత్​ సోరెన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

7 villagers killed in Jharkhand: Police
'స్వతంత్రం' కోసం ఏడుగురి దారుణ హత్య- అడవి మధ్య శవాలు

By

Published : Jan 22, 2020, 3:29 PM IST

Updated : Feb 18, 2020, 12:02 AM IST

ఝార్ఖండ్​ పశ్చిమ సింగభూమ్​ జిల్లా బురుగులికేరా గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఏడు ఘోర హత్యలు... ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలకు దారితీశాయి. పథ్తల్​గడీని వ్యతిరేకించి, హత్యకు గురైన వారిలో గ్రామపంచాయతీ అధికారి ఉన్నారు.
ఏడుగురు గ్రామస్థులను దారుణంగా హత్య చేశారన్న సమాచారంతో గ్రామంలోకి వచ్చిన పోలీసులు రాత్రంతా గాలించారు. చివరకు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో 7 మృతదేహాలను గుర్తించారు.

'పథ్తల్​గడీ' వివాదం

పథ్తల్​గడీ ఉద్యమంపై బురుగులికేరాలో మంగళవారం రాత్రి సమావేశం జరిగింది. ఉద్యమ మద్దతుదారులకు, వ్యతిరేకించేవారికి మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలోనే పథ్తల్​గఢీ మద్దతుదారులు ఏడుగురు గ్రామస్థులను అహహరించి అడవిలోకి తీసుకెళ్లారు. అనంతరం వారి వద్ద ఉన్న లాఠీలు, గొడ్డళ్ల వంటి ఆయుధాలతో ఏడుగురిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

సీఎం దిగ్భ్రాంతి

ఏడు హత్యల ఘటనపై ఝార్ఖండ్​ సీఎం హేమంత్ సోరెన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చట్టం ముందు ఎవరూ ఎక్కువ కాదని, ఘటనకు పాల్పడిన వారిని వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించేందుకు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

పథ్తల్​గఢీ ఉద్యమం..

తమ గ్రామంలోని గిరిజనులకు స్వతంత్ర హోదా ఉండేలా.. అటవీ భూవిు, నదులపై ప్రభుత్వ చట్టాలను వర్తింపజేయకూడదని కొందరు చేపట్టిన ఉద్యమం పేరు 'పథ్తల్​గఢీ'. ఉద్యమంలో భాగంగా గ్రామంలోకి ఇతరులకు అనుమతి లేదని ఊరి పొలిమేరలో బోర్డు పెడతారు. 2019 మధ్యకాలం నుంచి ఈ ఉద్యమం వార్తల్లో నిలిచింది.

2019 జూన్​ 19న ఖుంతి జిల్లాలో ఐదుగురు స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలను అపహరించి అత్యాచారం చేశారు పథ్తల్​గఢీ ఉద్యమ మద్దతుదారులు. పాఠశాల ఆవరణలో కార్యక్రమం నిర్వహిస్తున్న వారిపై ఇతరులనే నెపంతో దారుణానికి ఒడిగట్టారు.

ఈ ఘటన తర్వాత వారం రోజులకే అదే జిల్లాలో భాజపా మాజీ ఎంపీ నివాసానికి భద్రత కల్పిస్తున్న ముగ్గురు సిబ్బందిని అపహరించారు పథ్తల్​గఢీ మద్దతుదారులు. ఆ తర్వాత వారిని విడుదల చేశారు.

మావోయిస్టు జిల్లాల్లో ప్రభావం

పథ్తల్​గఢీ ఉద్యమ ప్రభావం ఝార్ఖండ్​లో ప్రధానంగా నాలుగు జిల్లాల్లో ఉంది. మవోయిస్టు ప్రాంతాలైన ఖుంతి, గుమ్లా, సిందేగా, పశ్చిమ్​ సింగభూమ్ ప్రాంతాల్లో అధికంగా ఉంది.

పథ్తల్​గఢీ ఉద్యమానికి సంబంధించి, చోటానాగ్​పుర్​ టెనాన్సీ చట్టం(సీఎన్​టీఏ), సంతల్​ పరగాణ టెనాన్సీ చట్టం(ఎస్​పీటీఏ)లకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారిపై నమోదైన దేశద్రోహం కేసులను వెనక్కి తీసుకుంటామని ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రకటించారు హేమంత్ సోరెన్​.

ఇదీ చూడండి: కశ్మీర్​లో ఉగ్రదాడికి భారీ కుట్ర- కేంద్ర హోంశాఖ అప్రమత్తం

Last Updated : Feb 18, 2020, 12:02 AM IST

ABOUT THE AUTHOR

...view details