తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి భోజనం తిని 60 మందికి అస్వస్థత - దుమ్కా

ఝార్ఖండ్​ దుమ్కా జిల్లాలో పెళ్లి భోజనం తిని 60 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన చందన్​ పహాడి గ్రామంలో చోటు చేసుకుంది. మెరుగైన చికిత్స కోసం 40 మందిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

పెళ్లి భోజనం తిని 60 మందికి అస్వస్థత

By

Published : Jun 29, 2019, 11:33 AM IST

జర్ముండి ఆరోగ్య కేంద్రంలో బాధితులు
ఝార్ఖండ్​ దుమ్కా జిల్లా తాల్​జరీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని చందన్​ పహాడి గ్రామంలో వివాహ భోజనం తిని 60 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను జర్ముండి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో 40 మంది పరిస్థితి విషమంగా ఉండటం వల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు.

" చందన్​ పహాడ్​ గ్రామంలో పెళ్లి భోజనం తిని అస్వస్థతకు గురైనట్లు మాకు రాత్రి పెట్రోలింగ్​ సమయంలో సమాచారం వచ్చింది. వారు తిన్న భోజనంలో బల్లి పడింది. అది తిన్న వారు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అక్కడకి వెళ్లి వారిని జర్ముండి ఆసుపత్రికి తరలించాం. పరిస్థితి విషమంగా ఉన్నవారిని జిల్లా ఆసుపత్రికి తరలించాం. "

- గగన్​ మిశ్రా, పోలీసు అధికారి

ఇదీ చూడండి: పుణె: ప్రహరీ గోడ కూలి 17 మంది బలి

ABOUT THE AUTHOR

...view details