తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దారికి అడ్డొచ్చిన ఆవులు- ఐదుగురు మృతి - మహారాష్ట్రలో

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాసిక్​లో లారీ, టెంపో ఢీకొని ఐదుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు.

దారికి అడ్డొచ్చిన ఆవులు- ఐదుగురు మృతి

By

Published : Sep 29, 2019, 2:51 PM IST

Updated : Oct 2, 2019, 11:12 AM IST

దారికి అడ్డొచ్చిన ఆవులు- ఐదుగురు మృతి

మహారాష్ట్ర నాసిక్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు.

ఇదీ జరిగింది...

సిన్నార్​ సమీపంలో నాసిక్​-పుణె రహదారిపై శనివారం సాయంత్రం ఓ పశువుల కాపరి.. ఆవులను రోడ్డు దాటిస్తున్నాడు. లారీ డ్రైవర్​ దారికి అడ్డంగా గోవులు రావడాన్ని గుర్తించి ఒక్కసారిగా బ్రేక్​ వేశాడు. అయినా లారీ పశువుల కాపరిని ఢీకొనగా... అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
అకస్మాతుగా ఆగిన ఆ లారీని వెనుక నుంచి టెంపో ఢీకొంది. లారీలోని ఇద్దరు, టెంపోలోని ఇద్దరు ప్రయాణికులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి : 'మత్తుతో చిత్తే... అందుకే ఈ-సిగరెట్లపై నిషేధం'

Last Updated : Oct 2, 2019, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details