తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొత్త ఎంపీల్లో 43 శాతం మంది నేరచరితులే' - 43%

2019 లోక్​సభ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ఎంపీల్లో దాదాపు సగం మంది నేరచరితులేనని 'అసోసియేషన్​ ఆఫ్​ డెమొక్రటిక్​ రిఫామ్స్​' పేర్కొంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య 26 శాతం పెరిగిందని తెలిపింది. ఎన్నికైన 533 మంది వివరాలు విశ్లేషించిన ఏడీఆర్​ 233 మందిపై నేరారోపణలు (క్రిమినల్​ ఛార్జెస్)​ ఉన్నాయని తేల్చింది.

'కొత్త ఎంపీల్లో 43 శాతం మంది నేరచరితులే'

By

Published : May 26, 2019, 5:46 PM IST

రాజకీయాల్లో నేరచరితుల సంఖ్య నానాటికి పెరిగిపోతుందన్న వాదనలకు బలం చేకూర్చింది 'అసోసియేషన్​ ఆఫ్​ డెమొక్రటిక్​ రిఫామ్స్​' (ఏడీఆర్​) తాజా నివేదిక. 17వ లోక్​సభకు ఎన్నికైన అభ్యర్థుల్లో దాదాపు సగం మంది నేరచరితులేనని తేలటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

మొత్తం 539 మంది ఎన్నికైన సభ్యులపై విశ్లేషించిన ఏడీఆర్​, అందులో 43 శాతం మంది అంటే 233 మంది ఎంపీలపై నేరారోపణలు ఉన్నాయని తేల్చింది. 2014తో పోల్చుకుంటే ఈ సంఖ్య 26 శాతం పెరిగిందని తెలిపింది.

పార్టీల వారీగా...

పార్టీ నేరచరితులు శాతం
భాజపా 116 39
కాంగ్రెస్​ 29 57
జేడీయూ 13 81
డీఎంకే 10 43
టీఎంసీ 9 41

గత ఎన్నికల్లో...

2014 ఎన్నికల్లో ఎన్నికైన అభ్యర్థుల్లో 185 మంది (34 శాతం) నేరచరితులు ఉన్నారు. అందులో 112 మంది ఎంపీలపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో 162 మంది (30 శాతం) ఎంపీలపై ఇతర నేర సంబంధ ఆరోపణలు ఉన్నాయి.

204 కేసులతో...

కేరళలోని ఇడుక్కి నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి దీన్​ కురియోకోస్​పై అత్యధికంగా 204 కేసులు ఉన్నట్లు పేర్కొంది ఏడీఆర్​.

ABOUT THE AUTHOR

...view details