జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లా అవంతిపొరలోని గోరిపొర ప్రాంతంలో ఈ తెల్లువారు జామున ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు, ఓ ఉగ్రవాద సానుభూతిపరుడు హతమయ్యాడు.
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం! - kashmir latest news
జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు, వారికి సాయం అందించే మరో వ్యక్తిని మట్టుబెట్టాయి భద్రత దళాలు.
కశ్మీర్లో ఎన్కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం
ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారో గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో మరికొంత మంది తీవ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.