తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పైరేట్స్​ నుంచి 18 మంది భారతీయులు విడుదల - నైజీరియాలో సముద్రపు దొంగలకు బందీలుగా చిక్కిన పద్దెనిమిది భారతీయులను విడుదలు అయ్యారు.

నైజీరియాలో సముద్రపు దొంగలకు బందీలుగా చిక్కిన 18 మంది భారతీయులు విడుదల అయ్యారు. ఈ సమాచారాన్ని నైజీరియాలోని భారత హైకమిషన్​ ట్విటర్​ వేదికగా వెల్లడించింది.

nigeria
పైరేట్స్​ నుంచి 18 మంది భారతీయుల విడుదల

By

Published : Dec 23, 2019, 4:36 AM IST

Updated : Dec 23, 2019, 4:56 AM IST

సముద్రపు దొంగలకు (పైరేట్స్​) చిక్కిన పద్దెనిమిది మంది భారతీయులు విడుదల అయ్యారని నైజీరియాలోని భారత హైకమిషన్​ వెల్లడించింది.

ఇదీ జరిగింది.

డిసెంబరు​ మూడో తేదీన నైజీరియా తీరంలో హాంకాంగ్​ పడవలోని 19 మందిని సముద్రపు దొంగలు అపహరించారు. అందులో పద్దెనిమిది మంది భారతీయులు. ఏఆర్​ఎక్స్​ మారిటైమ్​ సంస్థ ఈ వివరాలను తెలిపింది. ​

పైరేట్స్​ నుంచి 18 మంది భారతీయుల విడుదల

"డిసెంబరు 3వ తేదీన సముద్రపు దొంగలు​ అపహరించిన 18 మంది భారతీయులను విడుదల చేస్తున్నట్లు నైజీరియన్​ నౌకదళం, షిపింగ్​ కంపెనీ ధ్రువీకరించింది. బంధితులను సురక్షితంగా విడుదల చేసేందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు."

-భారత హై కమిషన్​ ట్వీట్​

బందీలైన భారతీయులు సురక్షితంగా బయటపడేందుకు.. నైజీరియాలో ఉన్న భారత హై కమిషన్..​ అఫ్రికన్​ దేశాల అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి : ఝార్ఖండ్​లో ఫలితాలు రేపే-హస్తం వైపే ప్రజల మొగ్గు!

Last Updated : Dec 23, 2019, 4:56 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details