మహారాష్ట్ర బుల్ధానాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ముంబయి-నాగ్పూర్ జాతీయ రహదారిపై వేగంగా వస్తోన్న ట్రక్కు టైరు పేలి.. వాహనం అదుపుతప్పింది. ఇటుక కార్మికులు ప్రయాణిస్తోన్న మరో వాహనంపై పడింది. ఘటనలో కార్మికుల వాహనం నుజ్జునుజ్జయింది. 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు.