తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విడిపోయిన 10 జంటలను కలిపిన 'కోర్టు'​ - Rajasthan breaking

పదికాలాల పాటు చల్లగా ఉండాలని పెళ్లిలో ఆశీర్వాదం పొంది ఒక్కటవుతారు. అందుకు అనుగుణంగానే వారి జీవితాల్లో కలహాలు వచ్చినా సర్దుకుపోతూ జీవనం సాగిస్తుంటారు. అయితే సయోధ్య కుదరని కొందరు దంపతులు తగాదాల కారణంగా విడిపోతుంటారు. ఇలా దూరమైన 10జంటలను మళ్లీ ఒక్కటి చేసి.. వారి జీవితాల్లో ప్రేమను చిగురింపజేసింది రాజస్థాన్​ ధోల్​పూర్ జిల్లా లోక్​ అదాలత్ కోర్టు​.

REUNITED 10 BROKEN FAMILIES  IN RAJASTHAN
రాజస్థాన్​ దోల్​పూర్​ జిల్లాలో రాజీపజడి కలిసిన పది జంటలు

By

Published : Feb 10, 2020, 6:12 AM IST

Updated : Feb 29, 2020, 7:52 PM IST

విడిపోయిన 10 జంటలను కలిపిన లోక్​ అదాలత్ కోర్టు

రాజస్థాన్​ ధోల్​పూర్ జిల్లాలో లోక్​ అదాలత్​ చొరవతో.. విడిపోయిన పది జంటలు మళ్లీ కలిశాయి. జిల్లా న్యాయసేవా ప్రాధికారసంస్థ వారి సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ కోర్టులో.. న్యాయమూర్తి వారి మధ్య రాజీ కుదిర్చారు. అనంతరం దంపతులు పరస్పరం పూలదండలు మార్చుకొని ఒక్కటయ్యారు.

ధోల్​పూర్​ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన లోక్​ అదాలత్​లో​ చాలాకాలంగా పెండింగ్​లో ఉన్న కేసులను పరిశీలించారు. ఈ క్రమంలో గొడవల కారణంగా విడిపోయిన 10జంటలు సహా ఇతర 6కేసుల్లో కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చారు న్యాయమూర్తి. కలహాల కారణంగా చాలాకాలం దూరంగా ఉన్న దంపతులు కలుసుకోగా.. వారి ఆనందానికి అవధుల్లేవు.

భవిష్యత్​ ఉజ్వలంగా ఉండాలని...

రాజీపడి ఏకమైన పది జంటల భవిష్యత్​ ఉజ్వలంగా ఉండాలని ఆశీర్వదించిన న్యాయమూర్తి.. మళ్లీ వారికి కుటుంబ బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలో ఆ జంటలు స్వీట్లు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.

"జిల్లా న్యాయ సేవా ప్రాధికారసంస్థ వారి సౌజన్యంతో లోక్​ అదాలత్​లో చాలాకాలంగా పెండింగ్​లో ఉన్న కేసులను పరిష్కరించాం. కక్షిదారుల మధ్య రాజీ కుదుర్చగలిగాం."
- న్యాయమూర్తి, లోక్​ అదాలత్​

ఇదీ చదవండి: 'తైపూసం' ఉత్సవంపై కనిపించని కరోనా ప్రభావం

Last Updated : Feb 29, 2020, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details