తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.2కోట్లు దోచుకున్న ఇంట్లోనే దొంగల మందు పార్టీ - పుణె న్యూస్​

Bengaluru Police Arrested Two Thieves: బెంగళూరులో సుమారు రూ.2 కోట్ల దొంగతనం చేసిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో ఘటనలో నకిలీ ఐపీఎస్​ అధికారినంటూ..ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్​ పోలీసులు.

Bengaluru Police Arrested Two Thieves
బెంగళూరు ఇద్దరు దొంగల అరెస్ట్ రూ.2కోట్లు స్వాధీనం

By

Published : Apr 7, 2022, 8:09 PM IST

Bengaluru Police Arrested Two Thieves: బెంగళూరులో ఓ ఇంట్లో దొంగతనం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కుమారస్వామి లేఅవుట్​లోని ఓ ధనవంతుడి నివాసంలో రూ.1.76 కోట్ల నగదు, రూ.12 లక్షల విలువైన బంగారాన్ని వీరు దొంగిలించారు. ఈ కేసులో సునీల్ కుమార్​, దిలీప్​ అనే వ్యక్తులను అరెస్ట్​ చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. పెద్ద మొత్తంలో నగదు లభ్యం కావడం వల్ల ఆదాయపు పన్ను అధికారులకు కూడా సమాచారం అందించారు.

ఇదీ జరిగింది:బెంగళూరులోని సుబ్రమణ్యపురకు చెందిన సునీల్​ కుమార్​ ఆటో నడుపుతుంటాడు. మరో నిందితుడు దిలీప్​ మగడి రోడ్డులో నివాసం ఉంటున్నాడు. వీరిద్దరూ డ్రగ్స్​, దొంగతనం కేసులో జైలు శిక్ష అనభవిస్తుండగా..స్నేహితులయ్యారు. సునీల్​ ఒకరోజు ఆటోలో ప్రయాణికుడ్ని దించడానికి వెళ్లగా.. సందీప్​ లాల్​ అనే వ్యక్తి ఇంటిని చూశాడు. సందీప్ ధనవంతుడని​.. ఒక్కడే నివసిస్తున్నాడని గమనించిన సునీల్​ చోరీకి కుట్ర పన్నాడు. సందీప్​ చెన్నైకు వెళ్లిన సమయం చూసిన నిందితులు.. మార్చి 28 అర్ధరాత్రి దొంగతనం చేశారు. చోరీకి యత్నించిన నిందితులకు మొదట ఇంట్లో ఎలాంటి నగదు లభించలేదు. చివరగా బ్యాగును చూసిన దొంగలకు అందులో సమారు రూ. 2కోట్లు దొరికాయి. అనంతరం ఇంట్లో ఉన్న విదేశీ మద్యాన్ని సేవించి..నగదును సమానంగా పంచుకున్నారు. దొంగతనం చేసిన సొమ్ముతో దిలీప్​ తల్లిదండ్రులకు బంగారు ఆభరణాలు చేయించి.. గోవాకు వెళ్లాడు. సునీల్ ఖర్చు పెట్టకుండా ఓ ప్రదేశంలో దాచి రోజు వెళ్లి చూసేవాడు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు

ఫేస్​బుక్​ మాయలో పడి: మహారాష్ట్ర పుణెలో సైబర్​ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నగరానికి చెందిన ఓ యువకుడు ఫేస్​బుక్​ మాయలో పడి సుమారు రూ.17 లక్షలు పోగొట్టుకున్నాడు. ప్లేబాయ్​ కంపెనీ లైసెన్స్​ ఇప్పిస్తానని ఫేస్​బుక్​లో మాయ మాటలు చెప్పాడు ఓ వ్యక్తి. ఆ మాటలు నమ్మిన యువకుడు తన తండ్రి రిటైర్​మెంట్​ డబ్బును అతడికి ఇచ్చాడు. తర్వాత మోసపోయానని తెలుసుకున్న యువకుడు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ..: ఉత్తరప్రదేశ్​ రాజధాని లఖ్​నవూ గోమతి నగర్​ ప్రాంతంలో నకిలీ ఐపీఎస్​ అధికారిని స్పెషల్​ టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడి నుంచి రెండు మొబైల్​ ఫోన్లు, నకిలీ ఐపీఎస్ ఐడీకార్డ్, ఉద్యోగ నియామక లేఖలు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లఖ్​నవూకు చెందిన ప్రతీక్​ కుమార్​ మిశ్రా కొంతకాలంగా నకిలీ జాబ్​ రాకెట్​ను నిర్వహిస్తున్నాడు. మున్సిపల్​, పోలీస్​ డిపార్ట్​మెంట్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. అనేక మందిని మోసం చేసాడని ఎస్పీ విశాల్​ విక్రమ్​ సింగ్​ తెలిపారు. మిశ్రా గొంతు మార్చే సాఫ్ట్​వేర్​ను ఉపయోగించి.. ఉద్యోగార్థులను మోసం చేసినట్లు చెప్పారు. అనేక మందిని మోసం చేసిన మిశ్రా.. సుమారు రూ.కోటి వరకు డబ్బులు దోచుకున్నాడని పేర్కొన్నారు. అతడి మోసాలను మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:'సౌండ్ బాక్స్'​పై పోలీసులకు డౌట్.. ఓపెన్ చేస్తే రూ.12కోట్ల డ్రగ్స్​!

ABOUT THE AUTHOR

...view details