Ayodhya Ram Mandir Guest List : జనవరి 22న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ మహాత్సవానికి ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందింది. తాజాగా రామమందిర వివాదంపై తీర్పు ఇచ్చిన అప్పటి సీజేఐ సహా ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.
వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ, అయన కుటుంబ సభ్యులు, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆయన భార్య, పిరమల్ గ్రూప్ ఛైర్పర్సన్ అజయ్ పిరమల్, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, టీసీఎస్ సీఈఓ కృతివాసన్‌ను రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సహా దేశంలోని ప్రముఖ క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు, దౌత్యవేత్తలు సహా దాదాపు 8వేల మందిని ఆహ్వానించింది.
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ 161 అడుగుల ఎత్తైన ఇసుక రాయితో ప్రైవేట్ ఛార్టర్ట్ విమానంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జనవరి 22న అయోధ్యకు ప్రైవేట్ జెట్‌లలో కొందరు అతిథులు వెళ్లనున్నారు. మరికొందరు ఒక రోజు ముందుగానే విమానాల్లో అయోధ్య, లఖ్‌నవూ చేరుకుని అక్కడ బస చేస్తారు. రామాలయ ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం పొందిన ప్రముఖులు: