దేశంలో కరోనా కేసులు భయంకర రీతిలో పెరిగిపోతున్నాయి. కొత్తగా రెండు లక్షల 61 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 18 లక్షలకు చేరింది. ఈ స్థాయిలో కరోనా ఉద్ధృతి సాగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఆంక్షల బాట పడుతున్నాయి. అంతర్రాష్ట్ర ప్రయాణాలు సాగించేవారికి నిబంధనలు అమలు చేస్తున్నాయి.
దేశ రాజధానిలో
కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీ చేరుకున్న ప్రయాణికులు ఏడు రోజులు క్వారంటైన్లో ఉండాలనే నిబంధన విధించింది. ఎయిర్‌పోర్ట్‌లలో ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తోంది. పాజిటివ్‌గా తేలితే.. హోంక్వారంటైన్ లేదా ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తోంది.
యూపీ
మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేసింది ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్. ఆర్టీపీసీఆర్ పరీక్ష 72 గంటల లోపు చేసినదై ఉండాలి. వారం కన్నా ఎక్కువ కాలం రాష్ట్రంలో ఉండాలనుకునేవారికి 14 రోజుల హోంక్వారంటైన్ తప్పనిసరి చేసింది.
అసోం
అసోం వైద్య శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఎయిర్‌పోర్టుల్లో వచ్చే ప్రతి ఒక్కరు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. విమానాశ్రయంలోనే కరోనా పరీక్షలకు నమూనాలు ఇవ్వాలి. ఫలితాలు వచ్చేంత వరకు క్వారంటైన్లో ఉండాలి. ముంబయి, బెంగళూరు నుంచి వచ్చే ప్రయాణికులు 72 గంటల్లోపు చేసిన ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్ష నెగెటివ్ పత్రాన్ని తప్పనిసరిగా వెంటతెచ్చుకోవాలి.
ఉత్తరాఖండ్
కరోనా ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ రిపోర్టు తప్పనిసరి చేసింది ఉత్తరాఖండ్. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, హరియాణా, యూపీ, దిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలను కరోనా ముప్పు అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో చేర్చింది. రోడ్డు, రైలు, వాయు మార్గం గుండా ఈ రాష్ట్రాల నుంచి వచ్చేవారు కరోనా నెగెటివ్ పత్రం తప్పక చూపించాలి.
చండీగఢ్
పంజాబ్, హరియాణా రాష్ట్రాల రాజధాని, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌కు వెళ్లాలనుకునే ప్రయాణికులు పంజాబ్ ప్రభుత్వం రూపొందించిన కోవా యాప్‌లో రిజిస్టర్ అవ్వాలి. నగరానికి వెళ్లిన తర్వాత.. ఓ డిక్లరేషన్‌ను నింపాలి. థర్మల్ స్క్రీనింగ్‌కు సహకరించాలి.
రాజస్థాన్