తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"వివేకా హత్యకేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం" - విచారణ ఈ నెల 22కి వాయిదా - వివేకా హత్య కేసు

YS Vivekananda Reddy PA Krishna Reddy Petition: వివేకా హత్యకేసులో ఆయన పీఏ కృష్ణారెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వివేకా కుమార్తె, అల్లుడు తెలిపారు. వాగ్మూలం ఇవ్వాలని తాము బలవంతం చేయలేదని సునీత, రాజశేఖరరెడ్డి తరఫు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. దిగువ కోర్టులో విచారణను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.

YS_Sunitha_Reddy_Petition
YS_Sunitha_Reddy_Petition

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 12:51 PM IST

వివేకా పీఏ ఆరోపణల్లో వాస్తవం లేదని వాదనలు - విచారణ ఈ నెల 22కి వాయిదా

YS Vivekananda Reddy PA Krishna Reddy Petition :వివేకా హత్య కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు వాంగ్మూలం ఇవ్వాలని తాము బలవంతం చేసినట్లు మృతుడి పీఏ కృష్ణారెడ్డి చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ తరఫున న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరావు, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ బి.నరసింహశర్మ ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. కృష్ణారెడ్డి వేసిన ప్రైవేటు ఫిర్యాదుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేవా అనే విషయాలను మేజిస్ట్రేట్‌ పరిశీలించకుండానే యాంత్రిక ధోరణిలో పోలీసులకు సిఫారసు చేశారన్నారు. వివేకా వద్ద పీఏగా పని చేసిన నేపథ్యంలో హత్య గురించి కృష్ణారెడ్డికి తెలిసి ఉంటుంది కాబట్టి వాంగ్మూలం ఇవ్వాలని మాత్రమే ఎస్పీ కోరారని తెలిపారు.

YS Vivekananda Reddy Murder Case :కృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదుకు విచారణ అర్హత లేదని దానిని ఎస్‌హెచ్‌వోకు ఇవ్వకుండా నేరుగా ఎస్పీకి ఇచ్చారన్నారు. పులివెందుల పోలీసులు ఇప్పటికే దిగువ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారని తెలిపారు. దాన్ని న్యాయస్థానం విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం దాఖలు చేసిన వ్యాజ్యాలు నిరర్థకం అవుతాయని పేర్కొన్నారు. దిగువ కోర్టులో విచారణ ప్రక్రియను నిలువరించాలని కోరారు. ఈ విషయంలో కృష్ణారెడ్డి వాదనలు వినాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.

పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలన్న సునీత, సీబీఐ- పిటిషన్లకు అనుమతిచ్చిన హైకోర్టు

వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారనే ఆరోపణతో మృతుని పీఏ కృష్ణారెడ్డి 2021 డిసెంబరులో పులివెందుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ ఒత్తిడి చేస్తున్నారని సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఒత్తిడి చేశారని ఆరోపించారు.

2023 డిసెంబరు 8న కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు విచారణ జరిపింది. కేసు నమోదు చేసి జనవరి 4న తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పులివెందుల పోలీసులు సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేశారు. అభియోగపత్రం దాఖలు చేశారు. పులివెందుల కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతోపాటు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సునీత, రాజశేఖర్‌రెడ్డి, ఎస్పీ రామ్‌సింగ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వోద్యోగిపై కేసు నమోదు చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరని రామ్‌సింగ్‌ తరఫు న్యాయవాది అన్నారు. రామ్‌సింగ్‌ విషయంలో అనుమతి తీసుకోలేదన్నారు. ఆయనపై కేసు నమోదుచేయడం ఇది రెండోసారి అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

కడప ఎస్పీని కలిసిన వైఎస్‌ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి

పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై.నాగిరెడ్డి వాదనలు వినిపించారు. తాము చెప్పినట్లు సాక్ష్యం ఇవ్వాలని పిటిషనర్లు కృష్ణారెడ్డిని ఒత్తిడి చేశారని తెలిపారు. స్థానిక పోలీసులు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాకే కృష్ణారెడ్డి ప్రైవేటు ఫిర్యాదు వేశారన్నారు. పిటిషనర్ల కారణంగా కృష్ణారెడ్డి కుమారుడి పెళ్లి కూడా నిలిచిపోయిందని తప్పు చేయకపోయినా ఆయన 90 రోజులు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉండాల్సి వచ్చిందని వివరించారు.

వివేకా హత్యకేసులో రాజకీయ పెద్దల పేర్లు చెప్పాలని ఎస్పీ రామ్‌సింగ్‌ కృష్ణారెడ్డిని కొట్టారని పేర్కొన్నారు. ఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఏ దశలోనైనా అనుమతి పొందొచ్చన్నారు. హత్యకేసు దర్యాప్తు నుంచి ఎస్పీ రామ్‌సింగ్‌ను సుప్రీంకోర్టు పక్కన పెట్టిందని తెలిపారు. ఈ వాదనలపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. పీపీ చెబుతున్నట్లు కృష్ణారెడ్డి స్థానిక పోలీసులకు కాకుండా నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు.

Sunitha on Viveka Case: అప్పుడే అవినాష్​ రెడ్డిపై అనుమానం మొదలైంది: సునీత

ABOUT THE AUTHOR

...view details