తెలంగాణ

telangana

'స్కూళ్లలో బుర్ఖాలు, హిజాబ్​లు వద్దు.. మోదీజీ చొరవ చూపండి!'

By

Published : Feb 11, 2022, 10:37 PM IST

Bar Association hijab: పాఠశాలల్లో ప్రతి ఒక్కరూ మతాలతో సంబంధం లేకుండా యూనిఫాం ధరించేలా చూడాలని ప్రధానిని కోరుతూ ఆల్ఇండియా బార్ అసోసియేషన్ లేఖ రాసింది. కర్ణాటకలో హిజాబ్ వివాదం చెలరేగిన నేపథ్యంలో రాసిన ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది.

BAR SCHOOL UNIFORM
BAR SCHOOL UNIFORM

Bar Association hijab: దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో విద్యార్థులంతా ఏకరూప దుస్తులు ధరించేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతూ ఆల్ఇండియా బార్ అసోసియేషన్ లేఖ రాసింది. విద్యార్థులు హిజాబ్ లేదా బుర్ఖాను ధరించకుండా చూడాలని న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి చేసింది. లౌకిక సంస్థల్లో ఇలాంటి వస్త్రధారణకు అనుమతులు ఉండవని పేర్కొంది. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు విద్యా సంస్థల్లో లౌకికత్వాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది.

All India Bar Association hijab

"మతపరమైన సంస్థల ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు ఎలాంటి నిబంధనలనైనా పెట్టుకోవచ్చు. మదరసాలలో హిజాబ్​లు, బుర్ఖాలు ధరించుకోవచ్చు. కానీ, సాధారణ లౌకిక విద్యా సంస్థల్లో ఇలాంటి వాటికి అనుమతులు లేవు. మతపరమైన ప్రదేశాల్లో తమ ఆచారాలను పాటించే హక్కు భారత పౌరులకు ఉంది. అయితే, నిర్దిష్టమైన డ్రెస్ కోడ్ ఉన్న సెక్యులర్ ప్రదేశాల్లో వీటికి అవకాశం లేదు."

-ఆల్ఇండియా బార్ అసోసియేషన్

ఈ మేరకు కేంద్రం సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ కోరింది. మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్కూల్ యూనిఫాంలు ధరించాలేలా చూడాలని పేర్కొంది. తద్వారా భారత లౌకిక విలువలను కాపాడాలని పిలుపునిచ్చింది.

కర్ణాటకలో హిజాబ్ వివాదం చెలరేగిన నేపథ్యంలో బార్ అసోసియేషన్ ఈ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి:ఇతర రాష్ట్రాలకూ హిజాబ్ వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details