ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఈటాలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. జైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక వృద్ధ ఖైదీని మంచానికి గొలుసులతో కట్టేసిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
92 ఏళ్ల వృద్ధ ఖైదీని గొలుసులతో కట్టి చికిత్స - 92ఏళ్ల వృద్ధుడ కాళ్లకు గొలుసు
జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 92ఏళ్ల వృద్ధ ఖైదీని మంచానికి గొలుసులతో కట్టారు అక్కడి సిబ్బంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఈటాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. అధికారులు చర్యలు చేపట్టారు.

హత్య కేసులో ఈటా జైల్లో శిక్ష అనుభవిస్తున్న 92ఏళ్ల వృద్ధుడికి సాధారాణ శ్వాస సంబంధిత సమస్యలు రావడం వల్ల కారాగార ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు అలీఘర్ ఆస్పత్రికి సిఫార్సు చేయగా అక్కడ పడకలు అందుబాటులో లేకపోవడం వల్ల తిరిగి ఈటా జైలు ఆస్పత్రికే తీసుకొచ్చారు. అక్కడ సిబ్బంది వృద్ధ ఖైదీని కాళ్లకు గొలుసులతో బంధించి మంచానికి కట్టేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం వల్ల అక్కడి జైళ్లశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈటా జైలు వార్డెన్ అశోక్ యాదవ్‌ను సస్పెండ్ చేశారు.
ఇదీ చూడండి:-ఆ కుటుంబంపై 'పాము కాటు'.. ఏమైందంటే?