తెలంగాణ

telangana

By

Published : May 20, 2021, 8:10 PM IST

ETV Bharat / bharat

బెంగళూరులో 20 రోజుల్లో 778మంది మృతి

కర్ణాటకలోని బెంగళూరులో గత 20 రోజుల్లో 778 మంది కరోనాతో మృతి చెందారని బృహత్​ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎమ్​పీ) ఆడిట్ తెలిపింది. దేశంలోనే అత్యధిక కరోనా మరణాలు నమోదైన రెండో రాష్ట్రంగా కర్ణాటక ఉంది.

corona
కరోనా

కర్ణాటక బెంగళూరులో కరోనా మరణాలపై బీబీఎమ్​పీ(బృహత్​ బెంగళూరు మహానగర పాలిక) నిర్వహించిన ఆడిట్​లో కీలక విషయాలు బయటపడ్డాయి. గత 20 రోజుల్లో 778మంది కరోనాతో మృతిచెందారని ఆడిట్​ తెలిపింది. వీరిలో చాలా మంది ఇంటి వద్దే మరణించినట్లు పేర్కొంది. ఇది ఆందోళనకరమైన విషయం అని పేర్కొంది. చికిత్స తీసుకోక, అసలు వ్యాధి సోకిందని తెలియక అనేకమంది మరణించారని వెల్లడించింది.

ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు బీబీఎమ్​పీ కమిషనర్​ గౌరవ్​ గుప్తా తెలిపారు. అయితే ఇందులో బీబీఎమ్​పీ వైఫల్యం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

దేశంలో కరోనా మృతుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. రెండొవ స్థానంలో కర్ణాటక ఉంది.

మహారాష్ట్రలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 83,777. కర్ణాటకలో మొత్తం కరోనా మృతులు 22,838.

ఇదీ చదవండి:దేశంలో మరో కొత్త వ్యాధి.. ఈసారి వైట్​ ఫంగస్​

ABOUT THE AUTHOR

...view details