ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ కార్యక్రమానికి ముఖ్యనేతలెవరూ హాజరు కావడం లేదని ప్రకటించింది ఆప్. అయితే పదవీ ప్రమాణానికి సంబంధించిన మరో విశేషాన్ని బయటపెట్టారు పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియా. 'దిల్లీ నిర్మాణ్' కార్యక్రమంలో భాగమైన వివిధ వర్గాలకు చెందిన 50 మంది వ్యక్తులు వేదికపై ఆసీనులు కానున్నారని వెల్లడించారు.
కేజ్రీ ప్రమాణస్వీకార వేదికపై ఎవరెవరో తెలుసా - kejriwal oath ceremony
ఫిబ్రవరి 11 నాటి ఫలితాల్లో విజయకేతనం ఎగురవేసింది ఆమ్ఆద్మీ పార్టీ. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు అరవింద్ కేజ్రీవాల్. అయితే పదవీ ప్రమాణానికి ప్రముఖులెవరినీ ఆహ్వానించలేదు కేజ్రీ. అయితే గత పాలనా కాలంలో చేపట్టిన 'దిల్లీ నిర్మాణ్' కార్యక్రమంలో భాగమైన వివిధ వర్గాలకు చెందిన 50 మందికి వేదికపై స్థానం కల్పించనున్నారు.
కేజ్రీవాల్ ప్రమాణస్వీకార వేదికపై ఎవరెవరో తెలుసా!
ఈ 50 మందిలో ఉపాధ్యాయులు, బస్సు సిబ్బంది, చారిత్రక బ్రిడ్జిని నిర్మించిన ఆర్కిటెక్టులు, అగ్నిప్రమాద ఘటనల్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబసభ్యులు వంటి విభిన్న నేపథ్యం కలవారికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.
Last Updated : Sep 5, 2022, 2:34 PM IST