తమిళనాడు రామనాథపురంలో.. బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు కేంద్ర నిఘా సంస్థ అధికారులు. వారి నుంచి రూ.4.5 కోట్లు విలువ చేసే 9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీర ప్రాంత భద్రతా దళాలు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారు.. శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా దేశంలోకి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు వెల్లడించారు.
రూ.4.5 కోట్ల విలువైన బంగారం స్వాధీనం - Directorate of Revenue Intelligence
తమిళనాడులో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు అధికారులు. స్మగ్లర్ల నుంచి రూ.4.5 కోట్లు విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రూ.4.5 కోట్ల విలువైన పసిడి స్వాధీనం
ఐదుగురు మత్స్యకారులతో వస్తున్న ఫిషింగ్ బోటును తమిళనాడు తీరంలో డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. వారి నుంచి సంచిలో ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకొని విచారించగా.. రామనాథపురం జిల్లాలోని మండపం సమీపంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్, మరక్కాయర్ పట్టినమ్ మధ్య నిషేధిత ప్రాంతంలో బోటు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.