భారత్‌లో రోజువారి నమోదవుతున్న కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 28,204 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 373 మంది మరణించారు. కొత్తగా 41,511 మంది కరోనాను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 97.45 శాతానికి చేరగా.. క్రియాశీలక కేసులు 1.21శాతానికి తగ్గాయి.
మొత్తం కేసులు:31,998,158
మొత్తం మరణాలు: 4,28,682
కోలుకున్నవారు:3,11,80,968
యాక్టివ్ కేసులు: 3,88,508
వ్యాక్సినేషన్
దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ నిర్విరమంగా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 54,91,647 డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 51,45,00,268 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
కొవిడ్ పరీక్షలు
సోమవారం ఒక్కరోజే దేశంలో 15,11,313 కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 48,32,78,545 కు చేరింది.
పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల వివరాలు..
- కేరళలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 13,049 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 105 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మహారాష్ట్రలో కొత్తగా 4,005 మందికి కరోనా సోకింది. 7,568 మంది కోలుకోగా.. 68 మంది మృతిచెందారు.
- తమిళనాడులో 1,929 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 23 మంది బలయ్యారు.
- కర్ణాటకలో కొత్తగా 1,186 కేసులు నమోదయ్యాయి. 1,776 మంది కోలుకోగా.. 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఒడిశాలో కొత్తగా 886 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 66 మంది మృతిచెందారు.
- హిమాచల్ ప్రదేశ్‌లో కొత్తగా 310 మందికి కరోనా సోకింది. 185 మంది కోలుకోగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 23 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా ఒకరు చనిపోయారు.
- బంగాల్లో కొత్తగా 557 మందికి వైరస్ సోకింది. కొవిడ్ కారణంగా మరో 11 మంది మరణించారు.
ఇదీ చూడండి:పిడుగుపాటుకు 24 మంది మృతి