తిరుమలలో వైభవంగా పుష్పయాగం - Pushpa yagam news
తిరుమలలో శ్రీవారికి పుష్పయాగ మహోత్సవాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వివిధ రకాల పూలు, పత్రాలతో స్వామి వారికి పుష్పార్చన చేయనున్నారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి 7 టన్నుల పూలను తితిదే సేకరించింది. పద్నాలుగు రకాల పూలు..ఆరు రకాల పత్రాలను యాగంలో ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు.