NATGRID: ఉగ్రవాద నియంత్రణలో భారీ ముందడుగు పడనుందా? - ప్రతిధ్వని
జాతీయ భద్రతలో అత్యంత కీలక పాత్ర పోషించనుంది... నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్. భారతదేశ రక్షణ లక్ష్యంగా దేశం లోపలా, వెలుపలా సమగ్ర సమాచారం సేకరించే పకడ్బందీ వ్యవస్థ ఇది. దశాబ్దం క్రితం ముంబయిలో ఉగ్రమూకల దాడితో మేల్కొన్న ప్రభుత్వం నాట్‌గ్రిడ్ ఏర్పాటుకు నడుం బిగించింది. ఉగ్రవాదుల భౌతిక కదలికలు కనిపెట్టడం దీని ప్రాథమిక కర్తవ్యమని మొదట భావించారు. విస్తృత చర్చలు, ప్రతిపాదనల తర్వాత ఇప్పుడది బహుళ లక్ష్యాలను ఛేదించే కీలక భద్రత వ్యవస్థగా ఏర్పడబోతోంది. ఈ నేపథ్యంలో నాట్‌గ్రిడ్ స్వరూప, స్వభావాలు ఎలా ఉంటాయి? దాని ఏర్పాటులో ఎదురైన అవరోధాలేంటి? నాట్‌గ్రిడ్ నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి సమన్వయం అవసరం? అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని.