ప్రతిధ్వని: డిజిటల్ రంగంలో వెల్లువెత్తుతున్న అవకాశాలు
కరోనా సంక్షోభంలోనూ భారత్‌కు డిజిటల్ రంగంలో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దేశ పౌరులందరికీ అంతర్జాల సేవలకు ఉద్దేశించిన డిజిటల్ ఇండియాకు నూతన ఉత్సాహం వస్తోంది. గూగుల్, ఫేస్ బుక్ వంటి సంస్థలు, భారత్‌లోని పెద్ద కంపెనీలు, అంకుర సంస్థల్లో పెట్టుబడుల భాగస్వామ్యాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. దేశమంతా డిజిటలీకరణకు గూగుల్ వచ్చే ఐదేళ్లలో 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. అందులో భాగంగా జియో సంస్థలో 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. జియో దేశీయంగా రూపొందిస్తున్న 5జీ టెక్నాలజీ.. భారత్ డిజిటల్ రంగానికి సరికొత్త ఉత్తేజాన్ని ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో భారత్ డిజిటల్ రంగంలో అవకాశాలు, భవిష్యత్‌పై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.