PRATHIDWANI : రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కావాలంటే ప్రత్యేకహోదా ఇవ్వాలని.. జగన్ ఒత్తిడి తేగలరా? - నేటి ప్రతిధ్వని
ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని నిలదీసేందుకు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వైకాపాకు మరో అవకాశం అందివచ్చింది. ఈ సమయంలో తమ పార్టీ బలాన్ని ఉపయోగించి, ఏపీకి ప్రత్యేకహోదా సాధించవచ్చు. మరి ఇంతటి కీలక అవకాశాన్ని ఒక అస్త్రంగా మలుచుకుని ముఖ్యమంత్రి హోదాలో జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయగలరా? హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతిస్తామని బీజేపీపై ఒత్తిడి తేగలరా? ప్రతిపక్ష నేతగా ఆనాడు హోదా కోసం ఆందోళనలు చేసిన జగన్... ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదు? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.