కోనసీమ తిరుపతిలో తెప్పోత్సవం - కోనసీమ
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయం వద్ద నుంచి స్వామి, అమ్మవార్లను పల్లకిపై ఊరేగింపుగా గౌతమి గోదావరి వద్దకు వేదపండితులు తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు. చేశారు. అనంతరం ప్రత్యేకంగా తయారుచేసిన హంస వాహనాన్ని గోదావరిలో ఉంచి తెపోత్సవాన్ని నిర్వహించారు.