ప్రతిధ్వని: కరోనా ఉద్ధృతి.. అప్రమత్తత
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. గాలి ద్వారా కూడా కరోనా సంక్రమిస్తుందన్న వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల జాబితాలో భారత్.. మూడో స్థానానికి చేరింది. అయితే.. మొత్తం కరోనా కేసుల రికవరీ రేటు.. 60 శాతం పైగానే ఉంది. వచ్చే 3, 4 నెలల్లో.. కోవిడ్ కేసులు తగ్గుతాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. కరోనా వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్ తో పాటు ఇతర సంస్థలు శ్రమిస్తున్నాయి. ఇప్పటికే మనుషులపై ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో.. దేశంలో కరోనా వ్యాప్తి విషయంలో ప్రజలు ఇంకా ఎంత అప్రమత్తంగా ఉండాలి? వ్యాక్సిన్ రావడానికి ఇంకా ఎంత కాలం పట్టవచ్చన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.