pratidhwani debate : పెట్రో ధరల తగ్గింపుతో సామాన్యులకు కలిగే ఊరట ఎంత? - prathidhwani debate on petrol prices decrease
పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. గడిచిన కొంతకాలంగా పెరగడమే తప్ప తగ్గింపు లేకుండా పైపైకి ఎగబాకిన పెట్రో ధరలు ఈ నిర్ణయంతో కాస్త కిందకు దిగాయి. కేంద్రం బాటలోనే దేశవ్యాప్తంగా ఇరవై రెండు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పన్నులు తగ్గించాలని నిర్ణయించాయి. అయితే... పెట్రోల్‌పై ఐదు రూపాయలు, డీజిల్‌పై పది రూపాయలు చొప్పున చేసిన ఈ తగ్గింపుతో సామాన్యులకు కలిగే ఉపశమనం ఎంత? అసలు ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత మేరకు పెరిగాయి... ఇప్పుడు తగ్గింది ఎంత? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.