ప్రతిధ్వని : అమరావతి ఏడాది పోరు...జరగాల్సిన న్యాయం? - అమరావతి తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా రాయపూడిలో జరిగిన అమరావతి జనభేరి బహిరంగ సభకు విపక్ష పార్టీలు, రైతు సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. రాజధాని అమరావతి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏడాదిగా రైతులు, రైతు కూలీలు, మహిళలు అలుపెరగని ఉద్యమాన్ని చేస్తున్నారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా, లాఠీ ఛార్జ్‌లు, నిర్బంధాలు, బెదిరింపులను సైతం లెక్కచేయకుండా ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు. ఈ సుదీర్ఘ పోరాటంలో అనేక మంది గుండెలు కూడా ఆగిపోయాయి. అయినా ముందుకు సాగుతూనే ఉన్నారు. మరోవైపు తమతో చేసుకున్న చట్టబద్ధమైన ఒప్పందం అమలుకు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమం కొనసాగిన తీరు జరగాల్సిన న్యాయంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.