ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSRCP_leader_cultivation_in_Jagananna_layout_in_Guntur_District

ETV Bharat / videos

YSRCP Leader Cultivation in Jagananna Layout: జగనన్న లేఅవుట్లు ఆక్రమణ.. ఏకంగా సాగుకు దిగిన వైసీపీ నేత - Government layout in Ponnur

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2023, 4:50 PM IST

YSRCP leader cultivation in Jagananna layout in Guntur District: "మేం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు" అంటూ ముఖ్యమంత్రి ఊదరగొడుతున్నారు. ఆయన ఎంతగా ఊదరగొట్టినా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇళ్లు నిర్మించుకోవటానికి పనికిరాని స్థలాల్లో ప్రభుత్వ లేఅవుట్లను ఏర్పాటు చేసింది. చెట్లు, పుట్టలు, గుట్టలు, పొలం గట్ల మధ్య లేఅవుట్లు వేశారు. అందువల్ల చిన్నపాటి వానొచ్చినా అవి కుంటల్లా మారుతున్నాయి. కొన్ని చోట్ల పొలాల మధ్య లేఅవుట్లు వేయగా.. లబ్దిదారులు ఇళ్లు కట్టుకోలేదు. దీన్ని అదునుగా భావించిన వైసీపీ నాయకులు ఏకంగా ఆ స్థలాల్లో వ్యవసాయం చేస్తున్నారు. 

గుంటూరు జిల్లా పొన్నూరులోని లేఅవుట్​లో ఓ వైసీపీ నాయకుడు వ్యవసాయాన్ని ప్రారంభించాడు. గతేడాది ఇదే విధంగా పొలాల మధ్యనున్న జగనన్న లేఅవుట్‌లో ఓ వైసీపీ నాయకుడు వ్యవసాయం చేశారు. ఈసారి మరో నాయకుడు లేఅవుట్‌కు చెందిన 50 సెంట్ల(అర ఎకర) విస్తీర్ణ భూమిలో వరి నాట్లు వేశారు. ఈ విషయం తెలిసినా మున్సిపల్ అధికారులు ఆ నాయకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. సాగు చేసిన పొలంలో కలుపుమందు చల్లి వరినాట్లు తొలగించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details