ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైసీపీ నేతల వైధింపులు తాళలేక చేతిని గాయపరచున్న యువకుడు.. వీడియో వైరల్

ETV Bharat / videos

YCP leaders Harassment: వైసీపీ నేతల వేధింపులు.. చేతిని గాయపరచుకున్న యువకుడు.. వీడియో వైరల్

By

Published : Jul 10, 2023, 2:58 PM IST

YCP leaders Harassment in Nellore: అధికార పార్టీ ఆగడాలు ఎంతలా పెచ్చరిల్లిపోతున్నాయో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. మోచేతికి గాయం చేసుకుని ఓ యువకుడు ఇకనుంచైనా మీ వేధింపులు ఆపండి అంటూ సోషల్ మీడియోలో షేర్​ చేసిన మానసిక వేదింపుల దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో నేస్తం ఫౌండేషన్ ప్రవీణ్ కుమార్ అంటే తెలియని వారు లేరు. మంచి యువకుడిగా సేవా కార్యక్రమాల్లో పదేళ్ల నుంచి అధికారులు, నాయకులకు సుపరిచితుడు. 2012 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నెల్లూరు నగరంలో కనిపిస్తున్న అనేకమైన బొమ్మలు, కలెక్టర్ కార్యాలయంలో అందమైన చిత్రాలు ఈ పౌండేషన్ వారు గీసినవే. మొదట్లో మేయర్​గా ఉన్నప్పుడు.. అబ్దుల్ అజీజ్​తో కలిసి ఉండేవారు. ప్రస్తుతం టీడీపీలోకి వచ్చిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి నడుస్తున్నాడు. 

నగరంలో చిత్రాలతో పాటు, చిరువ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ కార్పొరేటర్ దాసరి రాజేష్ వేధిస్తున్నాడని.. ఆర్థికంగా దెబ్బతీసేందుకు చూస్తున్నారని ప్రవీణ్​ వీడియోలో తెలిపారు. మానసిక ఆవేదనను బయటకు తెలియజేసేందుకు మోచేతిని మీద గాట్లు పెట్టుకుంటూ చిత్రీకరించారు. మీరు సంతృప్తిపడితే చాలంటూ సోషల్ మీడియాలో వస్తున్న వీడియో అందరినీ కలచి వేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details