ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP Leader Accused AP Health Minister Vidadala Rajini

ETV Bharat / videos

YCP Leader Accused Health Minister Vidadala Rajini: 'ఎదురు తిరిగినందుకే మంత్రి విడదల రజిని నాపై దాడి చేయించారు' - ఏపీ వార్తలు

By

Published : Aug 21, 2023, 9:42 PM IST

YCP Leader Accused AP Health Minister Vidadala Rajini: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తనపై హత్యాయత్నం చేయించారని వైసీపీ నాదెండ్ల మండల మాజీ కన్వీనర్ గొంటు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. చికిత్స పొందుతున్న శ్రీనివాసరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని రజినినీ.. జగన్ ఆదేశాలతో చిలకలూరిపేటలో గెలిపించామన్నారు. నియోజకవర్గంలో గెలిపించిన కార్యకర్తలను విభజించి గ్రూపు రాజకీయాలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాదెండ్ల మండలం చందవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి గైర్హాజరైన వాలంటీర్లను మంత్రి సస్పెండ్ చేయించారన్నారు. న్యాయస్థానం ఆదేశంతో విధుల్లో చేర్పించామన్నారు. మంత్రి రజినికి వ్యతిరేకంగా ఉంటున్నానని, మంత్రి తన అన్న జయభారత్ రెడ్డిని చేరదీసి.. తనను హత్య చేయించడానికి ఉసిగొల్పిందన్నారు. పార్టీ కార్యకర్తలతో పాటు తమను ఇబ్బందికి పెడుతున్న మంత్రి రజనిపై పార్టీ అధినేతలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మంత్రికి ఎదురు తిరిగినందుకే కక్షగట్టి తనమీద హత్యాయత్నం చేయించినట్లు శ్రీనివాసరెడ్డి వాపోయారు. ఈ సంద్భరంగా ట్రాక్టర్​తో దాడి చేసిన సీసీ ఫుటేజ్​ను మీడియాకు అందజేశారు. 

ABOUT THE AUTHOR

...view details