ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Protest Against MLC Anantha Babu

ETV Bharat / videos

Protest Against MLC Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబుకు ఆదివాసీల నుంచి నిరసన సెగ

By

Published : May 24, 2023, 8:28 PM IST

Triblas Protest Against MLC Anantha Babu in Rampachodavarm: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్సీ(MLC) అనంతబాబుకు ఆదివాసీల నుంచి గట్టిగా నిరసన సెగ తగిలింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి జైలు కెళ్లిన అనంతబాబు.. సభలు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. బహిరంగ సభను అడ్డుకునేందుకు ఆదివాసీ జేఏసీ నాయకులు యత్నించారు. దీంతో పందిరి మామిడి కూడలి వద్ద పోలీసులు వారిని అడ్డకోవడంతో.. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆదివాసీలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా.. అనంతరం వారిని బలవంతంగా  పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతబాబు సభ పెట్టడానికి వీళ్లేదన్న ఆదివాసీలు.. పోలీసుల తీరుపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబు రమేష్​ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అరెస్ట్​ అయిన ఆదివాసీ నాయకుల్లో కంగల శ్రీనివాస్, మట్ల వాణిశ్రీ, స్వప్న కుమారి, వరలక్ష్మి, లోత రామారావు, సోల్ల బొజ్జిరెడ్డి తదితరులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details