Tirumala Srivari Salakatla Brahmotsavam 2023: వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. స్వర్ణరథంపై ఉభయదేవేరులతో దర్శనమివ్వనున్న స్వామివారు - తిరుమలలో హనుమంత వాహనం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 1:45 PM IST
Tirumala Srivari Salakatla Brahmotsavam 2023 :తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామి గరుడ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు గరుడ సేవ ప్రారంభం అయ్యింది.చిరు జల్లుల మధ్య భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఉదయం శ్రీవారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం (Srivaru on Hanumatha Vahanam in Tirumala Salakatla Brahmotsavalu) ఇచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాటాలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వేష ధారణలతో వాహన సేవ ముందు ఆకట్టుకున్నాయి. రామావతారంతో ఆంజనేయునిపై ఆసీనులై విహరిస్తున్న స్వామి వారిని దర్శించునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణరథంపై ఉభయ దేవేరులతో మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.