Tension at Gangavaram Port: దూసుకొచ్చిన 3వేల మంది 'ఉక్కు కార్మికులు'.. విశాఖలో గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత
Tension at Gangavaram Port in Visakhapatnam: విశాఖలో గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. బొగ్గు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పోర్టు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. స్టీల్‌ప్లాంట్ కార్మికుల పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. గాజువాక బాలచెరువు వైపు స్టీల్‌ప్లాంట్ గేట్ నుంచి ప్రవేశించిన కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. పోలీసులను తోసుకుని పోర్టు గేట్ వద్దకు పరుగులు కార్మికులు పరుగులు తీశారు. గేట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు కార్మికులను అడ్డుకునేందుకు ఇనుపముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. ఆందోళన శిబిరం వద్దకు వేలాదిగా చేరుకున్న కార్మికులు.. పోలీసులను తోసుకుంటూ పోర్టు గేట్ వద్దకు పరుగులు తీశారు. దీంతో పోర్టు గేట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. మరోవైపు గంగవరం పోర్టు ఫైర్, ఇతర రక్షణ సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించారు. అయినప్పటికీ వెనక్కి వెళ్లేది లేదంటూ 1500 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, 1800 మంది కాంట్రాక్టు కార్మికులు పోర్టు గేటుకు 50 అడుగుల దూరంలో బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఏ క్షణమైనా గంగవరం పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధంగా ఉండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.