Attack on a street Vendor: తెనాలిలో వీధి వ్యాపారిపై.. మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త దాడి
Tenali Municipal Chairperson Husband Attacked a Street Vendor: ఓ వీధి వ్యాపారిపై మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. స్థానిక రజక పేట చెరువు వద్ద రామాంజనేయులు ఐదేళ్ల నుంచి రాగిజావ అమ్ముకునేవారు. ఇటీవల రజకచెరువుకు అభివృద్ధి పనులు చేపట్టటంతో చుట్టు పక్కల చిరు వ్యాపారులు ఖాళీ చేయాలని మున్సిపల్ సిబ్బంది వెల్లడించింది. రాగి జావ బండి తొలగించలేదంటూ మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త రియాజ్ ఖాన్ తనపై మూడు రోజుల క్రితం దాడి చేశాడని బాధితుడు వాపోయారు. తనపై దాడిచేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో.. తనకు ప్రాణ హాని ఉందని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. మాస్క్ ధరించి వచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ రియాజ్ ఖాన్ తనపై దాడి చేశాడని బాధితుడు ఆరోపించాడు. అంతే కాకుండా తాన రాగి జావ బండిని.. బండి దగ్గర కుర్చీలను కాలితో తంతూ వీరంగం సృష్టించాడని వాపోయాడు. ఆ సమయంలో నిస్సహాయుడిగా మారిపోయానని ఎం జరుగుతుందో తెలియని ఆయోమయ స్థితిలోకి చేరుకున్నానని అన్నాడు.