ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP_Leaders_Encroached_Pond_in_Machilipatnam

ETV Bharat / videos

అధికార పార్టీ నేతల ఆక్రమణల నుంచి చెరువును కాపాడండి: టీడీపీ - వైసీపీ నేతల భూ ఆక్రమణలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 24, 2023, 7:00 PM IST

TDP Leaders Fires on YCP for Encroaching Pond: అధికార వైసీపీ నేతలు యథేచ్ఛగా భూ కబ్జాలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం 25వ డివిజన్లో ఉన్న గుమ్మటాల చెరువును అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తున్నారని తెలుగుదేశం నేతలు (TDP Leaders) ఆరోపించారు. ఆ చెరువును కాపాడాలని అనేక సార్లు కలెక్టర్, ఆర్డీవో, నగర కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే (MLA), ఆయన కుమారుడి అండదండలతో కొంత మంది అధికార పార్టీ నేతలు నిరుపేదల నుంచి డబ్బులు వసూలు చేసి వారి చేత ఆ స్థలంలో పాకలు వేయిస్తున్నారని ఆరోపించారు. 

 చెరువు ఆక్రమణలకు గురవుతున్న విధానాన్ని స్థానిక టీడీపీ నాయకులు పరిశీలించారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే అవినీతికి తలొగ్గి భూ కబ్జాదారులకు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. గుమ్మటాల చెరువు కబ్జా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details