ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుపతిలో పులివర్తి నాని ఆమరణ నిరాహార దీక్ష భగ్నం - ఉద్రిక్తత - chevireddy mohith reddy

🎬 Watch Now: Feature Video

TDP_Leader_Pulivarthi_Nani_Suicide_Attempt

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2024, 5:45 PM IST

Updated : Jan 8, 2024, 9:01 PM IST

TDP Leader Pulivarthi Nani Suicide Attempt: తిరుపతి జిల్లా చంద్రగిరిలో దొంగ ఓట్లపై తెలుగుదేశం నేత పులివర్తి నాని చేపట్టిన నిరాహార దీక్షను కుట్రపూరితంగా భగ్నం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో భారీగా బోగస్‌ ఓట్లను తొలగించకుండా వైసీపీ అభ్యర్థి మోహిత్‌రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని నాని ఆరోపించారు. ఈ ఉదయం పులివర్తి నాని దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు నమోదయ్యాయని పులివర్తి ఆవేదన వ్యక్తం చేశారు. 7 నెలలుగా తాను, పార్టీ నాయకులతో కలిసి పోరాటం చేస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ఆర్డీవో, కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులకు ఆధారాలు సమర్పించినా చర్యలు తీసుకోలేదన్నారు.  

ఉదయం నుంచి జోరువానలోనూ తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద నాని దీక్ష కొనసాగింది. ఈ విషయం గమనించి పక్కనే దళితులతో పోటీ ఆందోళనను వైసీపీ నాయకులు చేయించారు. రెచ్చగొట్టే నినాదాలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితిని సృష్టించారు. అప్పటికే భారీగా పోలీసులు మోహరించి, ఇదే అదనుగా దీక్ష భగ్నానికి యత్నించారు. దీనిపై ఆగ్రహించిన పులివర్తి నాని శరీరంపై పెట్రోల్‌ పోసుకుని నిరసన తెలిపారు. పోలీసులు దగ్గరకు రాకుండా నాయకులు, కార్యకర్తలు నానీని చుట్టుముట్టారు. భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను ఈడ్చుకెళ్లి వ్యాన్లలో పడేశారు. ఆ తర్వాత పులివర్తి నానీని బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి దీక్షా శిబిరం నుంచి తరలించారు.    

Last Updated : Jan 8, 2024, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details