Sarpanches Met Nara Lokesh: హక్కుల కోసం పోరాడే సర్పంచులకు పూర్తి మద్దతుగా ఉంటాం: లోకేశ్ - లోకేశ్ పాదయాత్ర
Sarpanches Met Nara Lokesh: హక్కుల కోసం పోరాడే సర్పంచ్‌లకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచ్‌లు ఆయన్ను కలిసి వినతి పత్రం అందించారు. ప్రభుత్వం కొల్లగొట్టిన 14, 15 ఆర్ధిక సంఘం నిధులు తిరిగి ఇప్పించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా లోకేశ్ తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే పంచాయతీలను ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఈ సందర్భంగా లోకేశ్‌ను సర్పంచ్‌లు కోరారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల కుటుంబ సభ్యులకు ఏడాదిలో ఒకరోజు తిరుమల బ్రేక్ దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచుల సమస్యలు విన్న లోకేశ్.. పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.