ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rally for farmers in Krishna district

ETV Bharat / videos

Rally for farmers in Krishna district : "అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుని.. ఎకరాకు రూ.15వేలు చెల్లించాలి" - Rally for farmers in Krishna district

By

Published : Aug 2, 2023, 8:06 PM IST

Tdp Leader Ramu Rally to Support The Farmers :కొన్ని రోజులుగా కురిసిన అకాల వర్షాల వల్ల అన్నదాతలు భారీగా నష్టపోయారు. కురిసిన వానతో రైతులకు చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ నేత వెనిగండ్ల రాము డిమాండ్‌ చేశారు. గుడివాడ నియోజకవర్గంలో వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయని.. వారికి న్యాయం చేయాలన్నారు. నష్టపోయిన రైతుల పక్షాన ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. అనంతరం రైతులతో కలిసి గుడివాడ బైపాస్‌ రోడ్డు నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పంట కాల్వలు, డ్రైన్లలో కొన్నేళ్లుగా  పూడికలు తీయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంట పొలాలు ముంపునకు గురయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట మునిగిన పంట పొలాల రైతులను ఆదుకోవాలన్నారు. తక్షణమే అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుని.. ఎకరాకు రూ.15వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details