PRATHIDWANI ఇన్నిసార్లు వడ్డీరేట్లు పెంచినా ద్రవ్యోల్బణం ఎందుకు దిగి రావడం లేదు
వడ్డీ రేట్లు. ఇప్పుడు ఈ మాట వింటేనే ఉలిక్కి పడాల్సి వస్తోంది. కారణంగా కొంతకాలంగా నెలకొన్న ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు.. ఆ పేరుతో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీరేట్లు వరసగా పెంచుతూ రావడమే. ఇప్పుడు రిజర్వ్‌బ్యాంక్ఆఫ్ ఇండియా మధ్యంతర సమీక్ష సమావేశం నేపథ్యంలో ఇవే భయాలు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటికే దఫదఫాలుగా రెపోరేటు 1.9% వరకు పెంచిన ఆర్బీఐ.. మళ్లీ ఇప్పుడు ఏం కబురు చెబుతుందోనని వేతన, మధ్యతరగతి జీవులు బిక్కుబిక్కుమంటున్నారు. అసలు ఆర్ధికవ్యవస్థ సంక్షోభంలో ఉంటే.. చక్కదిద్దడానికి వడ్డీ రేట్లు పెంచడం మినహా మరో మార్గం లేదా. అలానే అనుకున్నా.. ఇన్నినెలలుగా, ఇన్నిసార్లు వడ్డీరేట్లు పెంచినా.. ద్రవ్యోల్బణం ఎందుకు దిగిరావడం లేదు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST