Prathidwani: నా రాష్ట్రానికి ఏమైంది.. ఒకప్పుడు అన్ని రంగాల్లో మిన్నగా.. మరి నేడు..? - ఈటీవీ భారత్ ప్రతిధ్వని కార్యక్రమం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 11, 2023, 9:58 PM IST
Prathidwani: ఎలా ఉండే రాష్ట్రం ఎలా మారింది.. ఈ రాష్ట్రం ఎక్కడికి పోతోంది? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? మనం ఎటువంటి పాలనలో ఉన్నాం? వివిధ రంగాల్లో దేశం మొత్తంలో ఆదర్శంగా నిలిచిన పరిస్థితుల నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే ఏం గుర్తుకు వస్తున్నాయి? అభివృద్ధిలో, మానవాభివృద్ధి సూచికల్లో, సంస్కరణల్లో ప్రశంసలు అందుకున్న రాష్ట్రం గడిచిన నాలుగున్నరేళ్లుగా ఏం వార్తలతో పతాకశీర్షికలతో నిలుస్తోంది? అసలు ఆంధ్రప్రదేశ్ గురించి ఇతర రాష్ట్రాల వారు ఏం అనుకుంటున్నారు? 2014లో రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏపీ ఏం పరిస్థితుల్లో ఉంది? 2019 తర్వాత ఏ పరిస్థితుల్లోకి వెళ్లింది? ఒకప్పుడు వెనుకబాటుతనానికి బిహార్, కక్షసాధింపు రాజకీయాలకు తమిళనాడు, అరాచక పాలనకు యూపీ ఇలా చెప్పుకునేవారు. ఈవాళ వాటి అన్నింటికీ ఏపీని నమూనాగా చూపిస్తున్నారా..? మీడియా, ప్రతిపక్షాలు, సామాజిక మాధ్యమాల గొంతు నొక్కటానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం కూడా వైసీపీ చేతిలో బాధితులు అయ్యాయి. ఇలాంటి పార్టీకి మరల ఓటు వేస్తే జరిగే అనర్థాలు ఏంటి? అవినీతి పరులు పాలకులైతే నీతిమంతులు జైళ్లలో మగ్గాలి. అరాచకం రాజ్యమేలుతుంటే ధర్మం చెరసాలల్లో మగ్గాల్సి వస్తోందనే మాటలు ఇప్పుడు ఎందుకు చర్చకు వస్తున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.