ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidwani_Debate_on_Fake_Votes

ETV Bharat / videos

Prathidwani: కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగితే తప్ప రాష్ట్రంలో ఓటు నిలబడదా..? - ETV Bharat Prathidwani

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2023, 10:38 PM IST

Updated : Sep 15, 2023, 10:43 PM IST

Prathidwani Debate on Fake Votes:రాష్ట్ర ఓటర్ల జాబితాలో లోపాలున్నాయని స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘంఅంగీకరించింది. 27 లక్షల ఓట్లకు సంబంధించి లోపాల్ని గుర్తించామని వెల్లడించింది. దీనిని బట్టి ప్రతిపక్షాలు కొంతకాలంగా లేవనెత్తుతున్న అభ్యంతరాలకు బలం చేకూరింది.. ఓటర్ల జాబితాలో ఎన్నో అవకతవకలు కనిపిస్తున్నా.. వాటిని సరిదిద్దండని రాష్ట్ర అధికారులకు విన్నవించినా వాటిని సరిదిద్దలేదు. ఓటు అనేది పౌరుడి హక్కు.. దానిని నిలబెట్టుకోవటం కోసం దిల్లీ వరకు వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని రంగంలోకి దించితే తప్ప మన ఓటు నిలబడదా అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి మన యంత్రాంగం అంత దారుణంగా ఉందా? అడ్డగోలుగా దొంగ ఓట్లు చేర్పించటం, మరోపక్క ప్రత్యర్థుల ఓట్లను తప్పుడు పత్రాలు సమర్పించి ఎగరగొట్టేయటం ఈ విషయంలో వైసీపీ ఎటువంటి అవకతవకలకు పాల్పడింది? కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజు నేరుగానే మన పార్టీ ఓట్లు కాకపోతే అబ్జక్షన్ చెప్పాలని క్యాడర్​ను ఆదేశించారు. అంటే అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని తెలియట్లేదా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Last Updated : Sep 15, 2023, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details