Prathidwani: ప్రజలు కులాలవారీగా విడిపోతే భవిష్యత్ పరిణామాలేంటి..?
Prathidwani: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కులతత్వమే శాపంగా మారిందా. ఒకప్పుడు రాజకీయ చైతన్యం, పురోగామి ఆలోచనలకు పురిటిగడ్డగా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు.. ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టడం అంత తేలికా. కొంతకాలంగా రాష్ట్రంలోని ప్రజలలో చర్చనీయాంశంగా ఉన్న విషయం ఇది. కులాలను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తున్న నేతల కుతంత్రాలకు రాష్ట్రం భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వస్తోందని విశ్లేషకులు, నిపుణులు వాపోతున్నారు. 2019 ఎన్నికల్లో ఇలానే కులాల మధ్య చిచ్చు పెట్టడం వల్ల రాష్ట్రానికి జరిగిన తీరని అన్యాయమే అందుకు నిదర్శనం అని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల నాటికి ఈ విషయంలో కులసంఘాలు, మేధావుల ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి. రాజకీయ వ్యూహకర్తల పేరుతో రాష్ట్రంలో కులాల కుంపటి రాజేసినందుకు రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న నష్టం ఏమిటి. ప్రజలు కులాల వారీగా విడిపోతే వారి భవిష్యత్తుకు ఎటువంటి నష్టం కలుగుతుంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.