Prathidhwani: కృష్ణా జలాల పంపిణీపై కేంద్ర నిర్ణయం రాష్ట్రానికి లాభమా..? నష్టమా..? - Andhra Pradesh top news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2023, 10:34 PM IST
Prathidhwani: కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన అంశాన్ని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు అప్పగించాలని కేంద్ర మంత్రివర్గం తాజాగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నీటి పంపిణీ అంశాన్ని ట్రైబ్యునల్‌కు అప్పగించాలని కేంద్రం నిర్ణయించినట్లు ఇటీవల ప్రధాని మోదీ కూడా తెలియజేశారు. అయితే, దీనివల్ల కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత, రాష్ట్రాల వారీగా అవసరాలు.. తదితర అంశాలపై ట్రైబ్యునల్ మళ్లీ విచారణ చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక అంశాలు చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు ఇచ్చిన కొత్త నిబంధనల ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉండబోతోంది..?, దశాబ్దాల తరబడి రాష్ట్రానికి ఉన్న నీటి హక్కుల్ని మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చేంతవరకూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది..? ఒకవేళ కృష్ణా జలాల పంపిణీ పున:పరిశీలనంటూ జరిగితే.. భాగస్వామ్యులైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల మధ్య ఉండాలి కానీ.. ఏపీ, తెలంగాణ మధ్యే ఎందుకు..? అన్న ప్రశ్నలు ప్రజల్లో రెకెత్తుతున్నాయి. ఈ అంశాలన్నింటీపై నేటి ప్రతిధ్వని.