NTR Statue Controversy: ఆత్మకూరులో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాట్లను.. అడ్డుకున్న పోలీసులు
NTR Statue in Nellore తెలుగుదేశం పార్టీ నేతలు, గ్రామస్తులు కలిసి ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టించాలని తీసుకున్న నిర్ణయాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటం పాడు గ్రామంలో స్థానిక నేతలు ఈ విగ్రహ ప్రారంభోత్స ఏర్పాట్లు చేస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరగటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాము ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటుకు ఎర్పాట్లు చేసుకుంటు ఉండగా గ్రామంలోని వైసీపీ నేతల ప్రోద్భలంతోనే తమను పోలీసులు అడ్డుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. అధికార పార్టీ ప్రోద్బలంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని వారు మండిపడ్డారు.
గ్రామంలో ఉన్న బస్టాండ్ సమీపంలో విగ్రహం పెట్టడానికి వీల్లేదని వైసీపీ నేతలు పట్టు పట్టగా.. అక్కడే విగ్రహ పెట్టాలంటూ చేయాలంటూ తెలుగుదేశం నాయకులు పట్టుపట్టారు దీంతో అక్కడ వివాదం తలెత్తింది. ఇందులో భాగంగానే టీడీపీ శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకొచ్చి బస్టాండ్ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మొత్తానికి అయితే ప్రస్తుతం విగ్రహం ఏర్పాటు చేశారు.విగ్రహ ఏర్పాటు అనంతరం పోలీసులు గ్రామంలోని పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అయితే ఏ క్షణంలో అయినా విగ్రహాన్ని తొలగించవచ్చనే అనుమానంతో టీడీపీ నేతలు విగ్రహానికి కాపలాగా ఉన్నారు.