ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎన్​ఏడీ ఫ్లై ఓవర్

ETV Bharat / videos

స్పీడ్​గా వచ్చి.. బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన ఆయిల్ ట్యాంకర్ - NAD flyover bridge in Visakhapatnam

By

Published : Mar 20, 2023, 4:25 PM IST

Oil Tanker Stuck Under NAD Flyover: విశాఖపట్నంలోని ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. అందుకే ట్రాఫిక్​ను మళ్లించడానికి గతంలో ఓ ఫ్లై ఓవర్​ను నిర్మించారు. ఇంత రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాణ నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది. తాజాగా ఆ ఫ్లైఓవర్ దగ్గర ఓ పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నంలోని ఎన్​ఏడీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఆయిల్ ట్యాంకర్ ఇరుక్కుపోయింది. శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఎయిర్‌పోర్ట్ జోన్ పోలీసులు ఆయిల్ ట్యాంకర్‌ని పక్కకి తరలించే పనిలో నిమగ్నమయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ఫ్లైఓవర్ కింద ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో వేరువేరు మార్గాల్లో వాహనాలను.. పోలీసులు పంపిస్తున్నారు. ప్రతి వాహనాన్ని ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లే విధంగా ట్రాఫిక్ మళ్లింపు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details