Minister on Panchakarla ఒకటి రెండు చేపలు చచ్చి బయటపడితే.. పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు : మంత్రి అమర్నాథ్ - Gudivada Amarnath
Minister Gudivada Amarnath: విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు పార్టీ నుంచి వైదలగటంపై రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. పార్టీ అధికారంలో ఉందని చాలామంది వస్తుంటారు.. పోతుంటారని ఆయన అన్నారు. అధికారం అనుభవించి వెళ్లిపోతున్న నాయకులతో వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని.. ఆ సముద్రంలో నుంచి ఒకటి రెండు చేపలు చచ్చి బయటపడితే పార్టీకి వచ్చే నష్టమేమి ఉండదని అన్నారు. విశాఖపట్నం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పంచకర్ల రాజీనామాతో పార్టీకి వచ్చిన నష్టమేమీ ఉండదని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్న జనసేన పార్టీకి మంత్రి సవాల్ విసిరారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్ధలపై విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీలు.. ఆ రెండు వ్యవస్థలను రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే ధైర్యం ఉందా అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. కరోనా సమయంలో వాలంటీర్లు ఎంతో సేవ చేశారని మంత్రి అమర్నాథ్ అన్నారు.