సీఎం జగన్‌పై సీఐడీకి మేదర కులస్తుల ఫిర్యాదు - ఎందుకంటే ?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 5:20 PM IST
Medara Samajika Sangham Complaint on CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై.. మేదర సామాజిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరహసింహారావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. 2019 ఏలూరు బీసీ గర్జన సభలో తాము అధికారంలోకి వస్తే మేదర కులస్తులను ఎస్సీలో చేరుస్తామని జగన్ హామీ ఇచ్చారని, అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లయినా ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదని పేర్కొన్నారు. మేదర కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చకుండా.. ఎన్నికల వేళ మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తున్నారని వివరించారు.
Narahasimharao Comments: ''వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. మా మేదర కులస్తులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని వైఎస్ జగన్.. 2019 ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో హామీ ఇచ్చారు. జగన్ సీఎం అయ్యి నేటితో నాలుగున్నరేళ్లు దాటింది. ఇప్పటివరకూ ఆ హామీని నేరవేర్చకపోగా, పట్టించుకోవటం లేదు. ఇప్పటికే అనేక పర్యాయాలు ఆయనను కలిసి, వినతి పత్రాలు అందజేశాం. అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. జగన్ వైఖరిని నిరసిస్తూ.. 150 మంది ఎమ్మెల్యేలు, 26 మంది ఎంపీలపై సీఐడీకి ఫిర్యాదు చేశాం. తక్షణమే సీఐడీ అధికారులు జగన్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం'' అని మేదర సామాజిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరహసింహారావు అన్నారు.