ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Locals Protest for Water in Palnadu District

ETV Bharat / videos

Locals Protest for Water in Palnadu District: 'రోడ్డు వేయలేదు సరే.. నీళ్లు కూడా ఇవ్వకుంటే ఎలా..?' రోడ్డెక్కిన కాలనీ వాసులు.. నిలిచిన వాహనాలు - Protest for Water

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2023, 12:50 PM IST

Locals Protest for Water in Palnadu District: నీటి సమస్య పరిష్కరించాలంటూ పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామ పరిధిలోని వైఎస్సార్ కాలనీ వాసులు బిందెలతో ధర్నాకు దిగారు. పది రోజులుగా నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. బోరు చెడిపోవడం వలన నీళ్లు రాక తమ కాలనీ వాసులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరారు. ఇప్పటికే పది రోజులు అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. 

పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లినప్పుడు వాటర్ ట్యాంక్ పంపిస్తున్నారని.. దీనివలన ప్రయోజనం ఉండటం లేదని తెలిపారు. సాయంత్రం పనుల నుంచి వచ్చిన తర్వాత నగదు చెల్లించి వాటర్ ట్యాంక్ తెప్పించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా కాలనీలో రోడ్డు అధ్వానంగా ఉన్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కాలనీ ఏర్పడినప్పటి నుంచి రోడ్డు నిర్మాణం జరగలేదని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details