Duddu Prabhakar Family: 'ప్రజాస్వామ్యవాదులపై అక్రమ కేసులా..? దుడ్డు ప్రభాకర్, శిరీషను తక్షణమే విడుదల చేయాలి'
Duddu Prabhakar Family on NIA: ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా.. పోలీసులో లేక బయటి వ్యక్తులో కూడా తెలియకుండా.. తన భర్తని అరెస్టు చేసి తీసుకువెళ్లారంటూ కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ సతీమణి కుసుమ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్, మావోయిస్టు ఆర్కే సతీమణి శిరీష అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని పౌర హక్కులు, విరసం నేతలు అన్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ ,ఉపా చట్టాల రూపంలో చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తక్షణమే ప్రభాకర్, శిరీషలను బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పకుండా ప్రాథమిక హక్కులను కాల రాస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యవాదులపై ఇటువంటి అక్రమ కేసులను బనాయించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.